'వినయ విధేయ రామ' జ్యూక్ బాక్స్ రివ్యూ

Thursday,December 27,2018 - 01:00 by Z_CLU

‘వినయ విధేయ రామ’ జ్యూక్ బాక్స్ రిలీజయింది. ఈ రోజు సాయంత్రం గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మరింత బజ్ ని ఆడ్ చేస్తుంది ఈ జ్యూక్ బాక్స్. అయితే సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే ఈ  5 పాటలు, ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

తందానే తందానే :  ఈ సినిమా నుండి ఫస్ట్ రిలీజైన సింగిల్ ఇది. సినిమాలోని ఫ్యామిలీ ఇమోషన్స్ ని ఎలివేట్ చేసిందీ సాంగ్. శ్రీమణి లిరిక్స్ అదిరిపోయాయి అనే టాక్ తో పాటు,  ఆడియెన్స్  లో  సినిమాపై  మరింత  కాన్సంట్రేషన్  ఫిక్సయ్యేలా చేసింది ఈ పాట. M.L.R. కార్తికేయన్ వాయిస్ ఈ పాటకి పెద్ద  ఎసెట్ అయింది.

తస్సాదియ్యా :  సినిమా నుండి రిలీజైన సెకండ్ సింగిల్ ఇది. సినిమా ఎంత జోష్ ఫుల్ గా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది ఈ పాట. జాస్ ప్రీత్ జాజ్, M.M. మానసి కలిసి పాడిన ఈ పాట, ఈ సారి మాస్ ఆడియెన్స్ కి కూడా స్ట్రేట్ గా రీచ్ అయింది. శ్రీమణి ఈ పాటకి లిరిక్స్ రాశాడు.

ఏక్ బార్ : చెర్రీ తో కలిసి బాలీవుడ్ నటి ఈషా గుప్తా స్టెప్స్ వేసిన స్పెషల్ సాంగ్ ఇదే. సాంగ్ కంపోజిషన్ లో DSP మార్క్ ఏ రేంజ్ లో కనిపిస్తుందో, ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై అంతే ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. జస్ట్ ఆడియో ఇలా ఉంటే, విజువల్స్ అదిరిపోవడం గ్యారంటీ అనే బజ్ అప్పుడే  సోషల్ మీడియాలో  స్టార్ట్ అయిపోయింది. ఈ పాటని స్వయంగా DSP పాడటంతో మరింత మాసిజం ఆడ్ అయిందనిపిస్తుంది.  ఫీమేల్    వర్షన్   రనీనా రెడ్డి పాడింది. శ్రీమణి లిరిక్ రైటర్.

 

రామ లవ్స్ సీత :  ‘తస్సాదియ్యా’ సాంగ్ తరవాత చెర్రీ, కైరా అద్వానీ ల కెమిస్ట్రీ ఎలివేట్ చేసే సాంగ్. ‘రామ లవ్స్ సీత’ అంటూ బిగిన్ అయ్యే ట్రెండీ లిరిక్స్, యూత్ తో పాటు మాస్ కి కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. శ్రీమణి ఈ పాటకి లిరిక్స్ రాశాడు. సింహా, ప్రియ హేమేష్ ఈ  పాట పాడారు.

అమ్మా నాన్న : సినిమాలోని ఇమోషనల్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుందీ సాంగ్. నిజానికి ‘తందానే తందానే’ సాంగ్ లిరిక్స్ కూడా అదే ఫ్లేవర్ ని ఎలివేట్  చేస్తున్నాయి. కాకపోతే ఈ సాంగ్ లో కొంచెం ఇమోషన్ డోస్ ఎక్కువగా ఉందనిపిస్తుంది. సినిమా చూస్తేనే  కానీ  ఈ 2 పాటల మధ్య డిఫెరెన్స్  ఏంటనేది  అర్థం కాదు. కాళభైరవ పాడాడు ఈ పాటని. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.

ఓవరాల్ గా ఒక స్పెషల్ సాంగ్ తో సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంటున్న ఈ సినిమా జ్యూక్ బాక్స్,  2 ఫ్యామిలీ సాంగ్స్ తో, 2 ఫాస్ట్ నంబర్స్ తో, ‘వినయ విధేయ రామ’ లో అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అనిపిస్తుంది.