మార్చి సెకండ్ వీక్ నుండి చెర్రీ-బోయపాటి సినిమా

Wednesday,February 28,2018 - 05:33 by Z_CLU

ప్రస్తుతం సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. మరో 4 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. అయితే ఈ సినిమా తరవాత ఏ మాత్రం బ్రేక్ తీసుకోవడం ఇష్టం లేని రామ్ చరణ్ మార్చి 8 నుండి బోయపాటి సినిమా సెట్స్ పైకి రానున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది బోయపాటి టీమ్. రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. వీరితో పాటు స్నేహ, ప్రశాంత్, అనన్య తోపాటు రమ్యకృష్ణ మరో క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది.

అల్టిమేట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి D.V.V. దానయ్య ప్రొడ్యూసర్. తమన్ మ్యూజిక్ కంపోజర్.