ట్రెడిషనల్ లుక్ లో మెగా పవర్ స్టార్

Saturday,November 24,2018 - 10:02 by Z_CLU

రీసెంట్ గా రిలీజ్ అయిన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ టీజర్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. అయితే ఈ టీజర్ చెర్రీ మాస్ ఆంగిల్ ని మాత్రమే రివీల్ చేసింది. అయితే ఆ పవర్ ప్యాక్డ్ టీజర్ తరవాత ఈ సినిమా నుండి మరో స్టిల్ ని రివీల్ చేశారు మేకర్స్. ఈ స్టిల్ లో పక్కా ట్రెడిషనల్ లుక్ లో మరింత మెస్మరైజ్ చేస్తున్నాడు చెర్రీ.

బోయపాటి సినిమా అంటే అటు మాస్ ఎలిమెంట్స్  ఎంత స్కోప్ ఉంటుందో ఇమోషనల్ ఎలిమెంట్స్ కి కూడా అంతే స్కోప్ ఉంటుంది.  ఈ సినిమాలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ చెర్రీకి అన్నయ్యలుగా నటిస్తున్నారు. వీరితో పాటు స్నేహ ఈ సినిమాలో మరో కీ రోల్ లో కనిపించనుంది. ఫిల్మ్ మేకర్స్ ఎక్కడా కన్ఫమ్ చేయలేదు కానీ సినిమాలో మోస్ట్ ఇమోషనల్ స్పేస్ ఈ క్యారెక్టర్స్ మధ్య ఉండబోతుందనిపిస్తుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. D.V.V. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.