సెట్స్ పైకొచ్చిన బాలయ్య-బోయపాటి సినిమా

Monday,March 02,2020 - 11:49 by Z_CLU

నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా ఎట్టకేలకు మొదలైంది. రామోజీ ఫిలింసిటీలో ఈరోజు ఉదయం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ పిక్చరైజ్ చేస్తున్నారు.

బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి సింహా, లెజెండ్ మూవీస్ చేశారు. ఆ రెండూ బ్లాక్ బస్టర్లే.

ఇక బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ మూవీ విషయానికొస్తే, ఇందులో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఓ పాత్రలో ఆయన అఘోరాగా కనిపించబోతున్నాడనే బజ్ జోరుగా నడుస్తోంది.

బాలయ్య-బోయపాటి సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రియ, అంజలిని హీరోయిన్లుగా తీసుకున్నారు.