మే 12 నుంచి బ్యాంకాక్ షెడ్యూల్

Tuesday,May 08,2018 - 11:08 by Z_CLU

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి హైద‌రాబాద్‌లో మేజ‌ర్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. త‌దుప‌రి షెడ్యూల్ బ్యాంకాక్‌లో మే 12 నుండి జ‌ర‌గ‌నుంది.

సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ లో రామోజీ ఫిలిం సిటీలో ఫ్యామిలీ స‌న్నివేశాల‌ను, అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో యాక్ష‌న్ ఎపిసోడ్‌ను పూర్తి చేశారు. ఈ 20 రోజుల షెడ్యూల్‌లో రామ్ చరణ్, ప్ర‌శాంత్, స్నేహ‌, కియరా అద్వానిల‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కొన్ని సీన్స్ తీశారు. అంత‌కు ముందు చిత్రీక‌రించిన షెడ్యూల్‌లో వివేక్ ఒబెరాయ్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై సన్నివేశాల‌ు తెరకెక్కించారు.

ఇప్పుడు నెక్ట్స్ షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లబోతున్నారు. ఈనెల 12 నుంచి 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు