హరీష్ శంకర్

Tuesday,November 29,2016 - 01:08 by Z_CLU

హరీష్ శంకర్ ప్రముఖ దర్శకుడు. మార్చ్ 31 , 1979లో జన్మించారు. రవి తేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘వీడే’ సినిమాతో అసోసియేట్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘నా ఆటో గ్రాఫ్’ రచయితగా, దర్శకత్వ శాఖ లో పనిచేశారు.’ రవి తేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తరువాత ‘బుజ్జి గాడు’,’చిరుత’,’చింతకాయల రవి’,’కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలకు రచయితగా అలాగే దర్శకత్వ శాఖ లో పనిచేశారు. దర్శకుడిగా ‘మిరప కాయ్’ సినిమాతో విజయం అందుకున్న హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఘన విజయం అందుకొని టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమా తరువాత ‘రామయ్య వస్తా వయ్యా’,’సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు…

Born : 31 march 1979

సంబంధిత వార్తలు