BhavadeeyuduBhagatSingh లెక్చరర్ గా పవన్

Monday,May 23,2022 - 12:38 by Z_CLU

Pawan Kalyan as Lecturer in Harish Shankar’s film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’. పదేళ్ళ కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా ? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా అప్ డేట్స్ గురించి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా అప్ డేట్స్ తో డీటెయిల్స్ కూడా చెప్పాడు దర్శకుడు హరీష్ శంకర్.

” ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో పవన్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. సినిమాలో పవన్ కేరెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అయితే ఇది పాన్ ఇండియా మూవీ కాదు. పక్కా కమర్షియల్ తెలుగు సినిమాగా తీయబోతున్నాం. ప్రస్తుతం పవన్ గారు క్రిష్ సినిమాతో పాటు రాజకీయ పరంగానూ బిజీగా ఉన్నారు. ఆగస్ట్ నుండి మా కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకోనుంది.” అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు హరీష్ శంకర్.

దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన ఈ అప్ డేట్స్ తో పవన్ ఫ్యాన్స్ ఖుషి చేసుకుంటున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం పవన్ లెక్చరర్ గా కనిపించనుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెట్టేసుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పవన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics