సోషల్ మీడియాలో DJ ట్రెండ్

Thursday,May 04,2017 - 12:35 by Z_CLU

సోషల్ మీడియాలో అప్పుడే DJ ట్రెండ్ బిగిన్ అయిపోయింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్ రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జూన్ 23 న థియేటర్స్ లో సరికొత్త బజ్ ని క్రియేట్ చేయనున్న ‘DJ’ తన హవాని ఇప్పుడే బిగిన్ చేసేసింది.

సాధారణంగా ఫ్యాన్స్ సినిమా రిలీజ్ ని సెలెబ్రేట్ చేసుకుంటారు.. ఆ తరవాత సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంటారు. కానీ DJ విషయంలో అలా కాదు. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా జస్ట్ 50 డేస్ దూరంలో ఉండటాన్ని కూడా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ రౌండ్ ఫిగర్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో మ్యాగ్జిమం స్పేస్ ని ఆక్యుపై చేసేసింది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అల్టిమేట్ మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.