DJ ఆడియో ఈవెంట్ లో హరీష్ శంకర్ ఇంటరెస్టింగ్ స్పీచ్

Wednesday,June 14,2017 - 06:30 by Z_CLU

మోస్ట్ అవేటింగ్ మూవీ DJ హవా బిగిన్ అయింది. ఇంకా సరిగ్గా 9 రోజులలో థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ సినిమా రీసెంట్ గా ఆడియో రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఆ అకేషన్ లో హైలెట్ అయిన మాసివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్ షార్ట్ & క్రిస్పీగా మీకోసం…

 సమయం వచ్చినపుడు వినిపించాల్సిందే…

అస్మైక యోగ సాంగ్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు సంస్కృత పదాలతో పాట ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచన వచ్చింది. కానీ అప్పుడే అనిపించింది. తెలుగు సాహిత్యాన్ని హైలెట్ చేసుకునే, సమయం వచ్చినప్పుడు వినిపించాల్సిందే, అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాల్సిందే… తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్కరిది. వన్య మృగాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో, తెలుగు సాహితాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది.

ఆ తిట్లు నన్నే తిట్టండి, ఆ బాధ్యత నాదే

సినిమా లిరిక్ రైటర్స్ కి చాలా అడ్డంకులు ఉంటాయి. ఒక లిరిక్ రైటర్ ఎలాంటి సాహిత్యం ప్లాన్ చేసుకున్నా అది ట్యూన్ కి తగ్గట్టే రాసుకోవాలి. అలా రాసుకున్న లిరిక్స్ సినిమాలోని క్యారెక్టర్స్ ఔచిత్యానికి , సిచ్యువేషన్స్ కి దాంతో పాటు డైరెక్టర్ టేస్ట్ కి కూడా మ్యాచ్ అవ్వాలి. అందుకే నా సినిమాలో గనక పాట బావుందంటే డెఫ్ఫినేట్ నా లిరిక్ రైటర్స్ గొప్పతనం. ఒకవేళ అందులో పదాలు మీకు నచ్చకపోతే ఆ తిట్లు నన్నే తిట్టండి. ఎందుకంటే వారి చేత అలా రాయించుకున్నది నేనే.

స్క్రీన్ వెనక హీరో…

ఈ సినిమాకి స్క్రీన్ పై హీరో అల్లు అర్జున్ అయితే స్క్రీన్ వెనక హీరో DSP. ఒక డైరెక్టర్ చెప్పిన సన్నివేశాన్ని డైరెక్టర్ కన్నా ఎక్కువగా అర్థం చేసుకుని అద్భుతమైన పాటలను కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్, సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అంతకన్నా అద్భుతంగా కంపోజ్ చేశాడు. ఆ విషయం సినిమా చూశాక మీకు అర్థమైపోతుంది.

DJలో డైలాగ్ కి పవర్ స్టారే స్ఫూర్తి

గబ్బర్ సింగ్ సక్సెస్ తరవాత పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ గురించి ఒక మాట చెప్పారు. ‘సక్సెస్ అనేది మనిషిని మార్చేస్తుంది. మనకు సంబంధమే లేని మాటల్ని మాట్లాడించేస్తుంటుంది. అందుకే ఒక సినిమాకి ఎంతలా కష్టపడాలో పడతాను. ఒకసారి సక్సెస్ వచ్చిందంటే ఆ సినిమా నాది కాదని దూరంగా వెళ్ళి పోతాను. మనం ఒక పని చేస్తే సక్సెస్ కనబడాలి కానీ మనం కనిపించాల్సిన అవసరం లేదు’ అన్నారు. DJ సినిమాలోని ఒక డైలాగ్ కి ఆయన చెప్పిన ఆ మాటే ఇన్స్ పిరేషన్. మీరా డైలాగ్ ట్రేలర్ లో చూడొచ్చు.

  పవన్ నుంచి ఆదేశం రావాలి

చాలా మంది పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడని అడుగుతుంటారు. దానికి సమయం రావాలి, ముఖ్యంగా ఆయన నుండి ఆదేశం రావాలి. ముందుగా ఆయనకు నేను అభిమానిని, ఆ తరవాతే గబ్బర్ సింగ్ కి డైరెక్టర్ ని. ఆయన సినిమాలు చూస్తూ అభిమానిని అయ్యాను. ఆయనతో ఇంకా సినిమాలు చేసినా చేయకపోయినా ఈ కట్టె కాలే వరకు ఆయన అభిమానినే.

దర్శకుడిగా పునర్జన్మనిచ్చింది ఆయనే

ఈ రోజు మీముందు ఈ స్థాయిలో నిలబడగలిగానంటే నాకు డైరెక్టర్ గా పునర్జన్మ నిచ్చింది నా మాస్ మహారాజ్ రవితేజ.

నా సంకల్పం గట్టిదని ప్రూఫ్ అయింది

మాస్ మహారాజ్ రవితేజతో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ చేస్తున్నప్పుడు రిలీజయింది ఆర్య. ఆ సినిమా చూశాక అసలు నిద్ర పట్టలేదు. అలాంటి ప్రొడ్యూసర్ తో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో, అల్లు అర్జున్ తో ఎపుడు సినిమా చేసే  చాన్స్ వస్తుందా అనే ఆలోచనతో నాకు నిద్ర పట్టలేదు. ఆ రోజు నేను కన్నా కల ఈ రోజు నెరవేరింది. సంకల్పం గట్టిగా ఉంటే అది జరిగి తీరుతుందని ప్రూఫ్ అయింది.

కాలర్ ఎగరేస్తారు

DJ లో సర్ ప్రైజెస్ ఉన్నాయి. ఆ విషయం మీరు సినిమా చూస్తే కానీ తెలీదు. ఏది ఏమైనా DJ చూశాక బన్ని ఫ్యాన్ గర్వంగా కాలర్ ఎగరేస్తాడు ఇది మాత్రం గ్యారంటీ.