మెగా హీరోలతో హరీష్ శంకర్ కి ఇది కామన్

Saturday,August 31,2019 - 10:56 by Z_CLU

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ మరింత స్పెషల్ కాబోతున్న విషయం తెలిసిందే. సినిమాలో పూజా హెగ్డే క్యారెక్టర్ ని ‘శ్రీదేవి’ అని రాసుకున్న హరీష్ శంకర్ సీనియర్ నటి శ్రీదేవి పాప్యులర్ సాంగ్ ‘ఎల్లువొచ్చి గోదారమ్మా..’ సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్నాడు. అయితే మెగా హీరోలతో ఇలా సాంగ్ రీమిక్స్ చేయడం ఈ డైరెక్టర్ కి కొత్త కాదు.

గతంలో కూడా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో సాయి తేజ్ చేత ‘గువ్వా గోరింక’ సాంగ్ కి స్టెప్పులు వేయించాడు. ఆ పాట మరీ పాత సాంగ్ కి ఉన్న గ్రేస్ ని మించిపోయింది అని చెప్పడానికి లేదు కానీ, ఉన్నంతలో యూత్ కి మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ఆ మ్యాజిక్ ని గుర్తు చేసింది.

ఇప్పుడు  మళ్ళీ అదే తరహా మ్యాజిక్ ని జెనెరేట్ చేయబోతున్నాడు హరీష్ శంకర్. హీరోయిన్ పేరు… ఈ సాంగ్ వరస పెట్టి చూస్తే కథలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ లోనే ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ ఉండబోతుందని తెలుస్తుంది.

చూడాలి మరీ.. అప్పట్లో వచ్చిన ఈ సాంగ్ పిక్చరైజేషన్ గురించి ఇప్పటికీ కూడా గొప్పగా చెప్పుకుంటారు… అలాంటి సాంగ్ ని ఎంచుకునే సాహసం చేసిన హరీష్ శంకర్… ఈ సినిమాలో ఎలా ప్రెజెంట్ చేయాలని ప్లానింగ్ చేసుకున్నాడో మరీ…