ఓవర్సీస్ లో 300 లొకేషన్లలో డీజే రిలీజ్

Friday,June 16,2017 - 10:33 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ డీజే, ఓవర్సీస్ లో భారీస్థాయిలో విడుదలకానుంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్ సంస్థ… ఇండియా వెలుపల 300 ప్రాంతాల్లో దువ్వాడ జగన్నాథమ్ సినిమాను విడుదల చేయనుంది. బన్నీ కెరీర్ లో భారీ ఓవర్సీస్ రిలీజ్ ఇదే.

ఒక్క అమెరికాలోనే 160 లొకేషన్లలో విడుదలకానుంది డీజే మూవీ. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్ల చెరో 20కి పైగా లొకేషన్లలో డీజే రిలీజ్ అవుతుంది. వీటితో పాటు కెనడా, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్ దేశాల్లో డీజే సినిమాను భారీ స్థాయిలో విడుదలచేయబోతున్నారు.

ఇంతకుముందు దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి, నేను లోకల్ సినిమాల్ని ఈ సంస్థే విదేశాల్లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు డీజే మూవీని కూడా ఇదే కంపెనీ పంపిణీ చేస్తోంది. హరీష్ శంకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. నిర్మాత దిల్ రాజుకు ఇది 25వ సినిమా.