హరీష్ శంకర్ కొత్త సినిమా "దాగుడు మూతలు"

Monday,August 14,2017 - 06:58 by Z_CLU

తన స్టయిల్ ను కాస్త పక్కనపెట్టి, పూర్తిగా దిల్ రాజు టేస్ట్ కు తగ్గట్టు ఓ సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు హరీష్ శంకర్. దానికి తగ్గట్టే కథ ప్రిపేర్ చేసుకున్నాడు. దిల్ రాజు అనుమతి కూడా తీసుకున్నాడు. అమెరికాలో లొకేషన్లు కూడా ఫైనలైజ్ చేశాడు. ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్టుకు టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు.

హరీష్ శంకర్ కొత్త సినిమా పేరు దాగుడుమూతలు. గతంలో ఇదే టైటిల్ తో సీనియర్ ఎన్టీఆర్, బి.సరోజ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ టైటిల్ తో తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు హరీష్ శంకర్. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా ఉంది.

దాగుడుమూతలు సినిమాలో ఇద్దరు హీరోలు నటించబోతున్నారు. ఆ హీరోలు ఎవరు, సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది లాంటి విషయాలతో త్వరలోనే అఫీషియల్ గా ఓ ఎనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు.