దువ్వాడ మెరుపులు  

Saturday,June 24,2017 - 10:00 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాహ్మణ కుర్రాడిగా నటించిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘డీజే దువ్వాడ జగన్నాథం’ నిన్న గ్రాండ్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలో హైలైట్స్ పై ఓ లుక్కేద్దాం…

ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా, మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ టైం బ్రాహ్మణ కుర్రాడిగా నటిస్తున్నాడనగానే డీజే పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్లాయి. బన్నీ ని ఈ గెటప్ లో చూడగానే సినిమాలో దువ్వాడ గా అదరగొట్టేస్తాడని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. నిజంగానే దువ్వాడ జగన్నాథం అనే క్యారెక్టర్ తో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ మెస్మరైజ్ చేశాడు బన్నీ. ముఖ్యంగా బ్రాహ్మణ యాస, డైలాగ్ డెలివరీ, ఎమోషన్ తో సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాడు.


‘డీజే’ లో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందనగానే వీరిద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే టాక్ ముందే హల్చల్ చేసింది. ఇక అందరు ఊహించినట్లే సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా బన్నీ – పూజా మధ్య రొమాంటిక్ సీన్స్ అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాకు హైలైట్ అయ్యాయి.


తన మ్యూజిక్ తో డీజే కి రిలీజ్ కి ముందే భారీ హైప్ తీసుకొచ్చిన దేవి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో బలమైన సన్నివేశాలను ఎలివేట్ చేసి హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా డి.ఎస్.పి అందించిన ‘శరణం భజే భజే’,’బడిలో గుడిలో మదిలో’,’బాక్సు బద్దలయిపోయే’,’సీటీ మార్’ పాటలు అందరినీ ఆకట్టుకొని అలరించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి.

రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ డీజే లో స్పెషల్ హైలైట్స్ అని చెప్పొచ్చు. ప్రీ ఇంటర్వెల్ లో బన్నీ మంత్రాలు చదువుతూ చేసే భారీ ఫైట్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మరో ఫైట్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తాయి. ముఖ్యంగా బన్నీ హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కు మరింత బలం చేకూర్చి సినిమాకు హైలైట్ గా నిలిచాయి.


డీజే లో అందరినీ ఎట్రాక్ట్ చేసి హైలైట్స్ నిలిచాయి హరీష్ శంకర్ డైలాగ్స్..కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “పబ్బుల్లో వాయించే డీజే కాదు పగిలే పోయేలా వాయించే డీజే” ,’ ఈరోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్ యుద్ధం శరణం గచ్చామి”,,”మనం చేసే పనిలో మంచి కనబడాలి గాని మనిషి కనిపించనక్కర్లేదు”,’చిన్నప్పుడు మీ నాయనమ్మ పిల్లుల్ని చంపొద్దని చెప్పింది కానీ పులుల్ని కెలకొద్దని చెప్పలేదా”,’మధ్య తరగతి వాళ్లే ముందు స్కీములను నమ్ముకొని ఆ తర్వాత స్కాముల్లో తేలతారు.” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్ బాగా థియేటర్స్ లో విజిల్స్ వేయించి సినిమాకు హైలైట్ గా నిలిచాయి…


బన్నీ డాన్సులు డీజే కి మెరుపులు అద్దాయి. దేవి మ్యూజిక్ కి బన్నీ ఎనర్జిటిక్ డాన్సులు ఫాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా మెస్మరైజ్ చేసి ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘బడిలో గుడిలో మదిలో ‘ అనే సాంగ్ లో చమట పట్టకుండా సింపుల్ స్టెప్స్ తో ఎట్రాక్ట్ చేసిన బన్నీ క్లైమాక్స్ కి ముందు వచ్చే ‘సీటీ మార్’ సాంగ్ లో తన మార్క్ డాన్సులతో అదుర్స్ అనిపించుకున్నాడు.