పవన్ - వరుణ్ సినిమాలకు టైటిల్స్ ఫిక్స్.....

Monday,October 09,2017 - 05:07 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్ సినిమాగా తెరకెక్కుతున్న పవన్ -త్రివిక్రమ్ సినిమాకు ‘అజ్ఞాత వాసి’ అనే టైటిల్ యాప్ట్ అని భవించిన యూనిట్ ఈ టైటిల్ నే సినిమాకు ఖరారు చేసారని తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమా కోసం ఫిలిం చాంబర్ లో ‘అజ్ఞాతవాసి’ టైటిల్ ను  హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై  రిజిస్టర్ చేయించాడు నిర్మాత రాధా కృష్ణ . సో పవన్ సినిమాకు ఈ టైటిలే ఫిక్స్ అన్నమాట.

వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న లవ్ ఎంటర్టైనర్ కోసం కూడా అప్పట్లో పవన్ నటించిన ‘తొలి ప్రేమ’ టైటిల్ ను ఫిక్స్ చేసేశారు మేకర్స్. లేటెస్ట్ గా నిర్మాత భోగవల్లి ప్రసాద్ ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు పవన్ సూపర్ హిట్ టైటిల్ నే ఫిక్స్ చేసుకున్నాడన్నమాట వరుణ్ తేజ్ .

ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమాను రూపొందించిన హరీష్ శంకర్ త్వరలోనే యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ హీరోగా రాజ్ తరుణ్ నటించే చాన్స్ ఉంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజీ లో ఉన్న ఈ సినిమాకోసం వాడుకలో ఉన్న ‘దాగుడు మూతలు’ టైటిల్ ను లేటెస్ట్ గా రిజిస్టర్ చేయించాడు నిర్మాత దిల్ రాజు.