అరుదైన రికార్డు సృష్టించిన డీజే

Thursday,May 25,2017 - 07:00 by Z_CLU

తెలుగు సినీచరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ సాధించలేని  అరుదైన రికార్డును అల్లు అర్జున్ సాధించి చూపించాడు. బన్నీ నటిస్తున్న దువ్వాడ జగన్నాథమ్ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా టీజర్ 15 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. తెలుగు సినీచరిత్రలో ఇప్పటివరకు ఏ మూవీ టీజర్ కు ఇన్ని వ్యూస్ రాలేదు

రిలీజైనప్పటి నుంచి ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. విడుదలైన కొన్ని గంటలకే మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ తర్వాత 24 గంటల్లోనే 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అతి తక్కువ టైమ్ లో మిలియన్ వ్యూస్ సాధించిన మూడో సినిమాగా డీజే రికార్డు సృష్టించింది. ఇప్పుడు  ఏకంగా 15 మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డు స్థాపించింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది డీజే సినిమా. మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ సింగిల్ రిలీజ్ అయింది. అది కూడా సూపర్ హిట్ అయింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.