గ్రాండ్ గా రిలీజైన డీజీ ఆడియో

Monday,June 12,2017 - 05:06 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు-హరీష్ శంకర్-దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ ఏవైటింగ్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ‘డీజే’ జూన్ 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్, దిల్‌రాజు మనవడు అరాంచ్‌ బిహ సీడీ ను ఆవిష్కరించగా, ఆడియో సీడీలను అల్లు అరవింద్‌ విడుదల చేసి తొలి సీడీని దర్శకుడు హరీష్‌ శంకర్‌కు అందించారు.


ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ – ‘పబ్బులో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజే అనే డైలాగ్‌తోనే ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఈ ఏంటో చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ సినిమాకు పగిలిపోయేలా మ్యూజిక్‌ అందించిన దేవి కి థాంక్స్. ఈ సినిమాలో పూజను చూసిన తర్వాత కుర్రాళ్ళు ల‌వః, ల‌వ‌స్త్య‌, ల‌వ‌భ్యోః అంటూ ఆమెతో ప్రేమలో పడతారు. డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విష‌యానికి వ‌స్తే, త‌న సినిమాలన్నీ చూశాను. ఆయన సినిమాలన్నింటిలో పంచ్‌ డైలాగ్స్‌ బావుంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంత రాయగలరో, అంతే బాగా ఎమోషన్‌ కూడా రాయగలరు. అలాంటి కథతో తెరకెక్కిన సినిమాయే డీజే. మెగాభిమానులు అంటే కేవలం మెగాస్టార్‌ అభిమానులే కాదు, చిరంజీవిగారు, పవన్‌కళ్యాణ్‌గారు, రామ్‌చరణ్‌, తేజు, వరుణ్‌, నిహ ఇలా అందరి అభిమానులు.. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దిల్‌రాజుగారు నేను ఒకేసారి కెరీర్‌ స్టార్ట్‌ చేశాం. ఆయన బ్యానర్‌లో మూడోసారి, 25వ సినిమా చేస్తున్నాం. ఇప్పుడు మా కాంబినేషన్‌లో వస్తున్న డీజే దువ్వాడ జగన్నాథమ్‌ హ్యాట్రిక్‌ హిట్‌ మూవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా దిల్‌రాజుగారి కోసమే పెద్ద హిట్‌ కావాలి అని కోరుకుంటున్నా” అన్నారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ”మా వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి 14 సంవత్సరాలైంది. మా బ్యానర్‌లో దిల్‌ తొలి సినిమా అయితే సెకండ్‌ మూవీ నేను, బన్ని కలిసి ఆర్య చేశాం. ఆర్య బన్నికి ఓ స్టార్‌ ఇమేజ్‌ను, సుకుమార్‌ను ఓ స్టార్‌ డైరెక్టర్‌ను చేయడమే కాక మా సంస్థకు స్టార్‌ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఆర్య, పరుగు, సినిమాల తర్వాత బన్నితో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా తీయడానికి 9ఏళ్ళు పట్టింది. అందుకు కారణం మంచి కథ దొరకకపోవడమే.. నాలుగేళ్ళుగా ఏన్నో కథలను అనుకున్నా ఏవీ వర్కవుట్‌ కాలేదు. ఫైనల్ గా ఈ కథ ఇద్దరికీ బాగా నచ్చడంతో డీజే ను స్టార్ట్ చేసేశాం. హరీష్‌తో చేస్తున్న మూడో సినిమా ఇది. మా బ్యానర్‌కు 25వ సినిమా. ఇది మా బ్యానర్‌కు స్పెషల్‌ . జూన్‌ 23న సినిమానే మాట్లాడుతుంది. దేవిశ్రీప్రసాద్‌ మా బ్యానర్‌లో చేస్తున్న ఏడో సినిమా. ఈ సినిమాలో బన్నీ పక్కన పూజాకు అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. 23న మెగా అభిమానులంతా సినిమా చూసి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉంటుంది” అన్నారు.


డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ – ”డీజే ఆడియో జ్యూక్‌ బాక్స్‌ను రిలీజ్ చేయగానే చాలా మంది ఫోన్స్ చేసి అభినందించారు. స్క్రీన్‌ మీద హీరో బన్ని అయితే, స్క్రీన్‌ వెనుక దేవిశ్రీ హీరో. ఈరోజు ఉదయం కూడా డీజే సినిమాను పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో కలిపి చూశాను. పాటలెంత బావున్నాయో, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అంతకంటే గొప్పగా ఉంది. దేవిశ్రీకి పెద్ద థాంక్స్‌. దర్శకుడిగా నా స్థాయిని పెంచింది పవన్‌కళ్యాణ్‌గారైతే, దర్శకుడిగా నాకు జన్మనిచ్చింది మాత్రం నా అన్నయ్య రవితేజగారే. ఆర్య సినిమాలో బన్ని మూన్‌ వాక్‌ చూసి ఎప్పుడైనా ఈ హీరోతో పనిచేస్తానా, ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌తో పనిచేస్తానా, ఓ కొత్త దర్శకుడికి అన్ని సమకూర్చిన రాజుగారితో పనిచేస్తానా అని రాత్రంతా ఆలోచిస్తూ ఎగ్జయిట్‌మెంట్‌తో పడుకోలేదు. కానీ ఈరోజు అదే హీరో, నిర్మాత, మ్యూజిక్‌ డైరెక్టర్‌తో డీజే సినిమా కోసం పనిచేశాను. మన సంకల్పం గట్టిగా, స్వచ్చంగా ఉంటే ఏదైనా సాధించొచ్చనడానికి ఇదే ఉదాహరణ.. అల్లుఅర్జున్‌గారికి నేను ఆర్య నుండి పెద్ద ఫ్యాన్‌ని. నాది ఆరు సినిమాల అనుభవమైతే, అల్లుఅర్జున్‌గారిది 17 సినిమాల అనుభవం. బన్నికి 24గంటలు తప్ప వేరే ధ్యాస ఉండదు. బ్రహ్మణ అబ్బాయి క్యారెక్టర్‌ కోసం బన్ని పడ్డ కష్టం చూసి, బ్రహ్మణులందరూ తనను అక్కున చేర్చుకుంటారు. క్యారెక్టర్‌ చేస్తున్నంత సేపు నాన్‌వెజ్‌ కూడా మానేసారు. ఓ డైరెక్టర్‌ను మాగ్జిమమ్‌ పుష్‌ చేసి నా నుండే అన్ని రాబట్టుకున్నారు. పూజా సినిమాకు పెద్ద ప్లస్‌. క్లైమాక్స్‌లో ఫైట్‌ లేకుండా ఎంటర్‌టైనింగ్‌గా పూర్తి చేయడానికి బన్నిగారెంతో పుష్‌ ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి అభిమాని కాలర్‌ ఎగరేస్తాడు. అందుకు నాది పూచీ” అన్నారు.


అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ”ఓ సారి మా ఇంట్లో బ్రహ్మణులను చూసి ఇంట్లో ఏదో పూజ ఏమోనని అనుకున్నాను. అయితే బన్ని ఈ సినిమాలో క్యారెక్టర్‌ కోసం వేదాలు ఎలా చదవాలని, ఎలా మాట్లాడాలని నేర్చుకుంటున్నాడని తెలిసి, ఇన్ని సినిమాలు తర్వాత కూడా తను క్యారెక్టర్‌ కోసం పడుతున్న కష్టం చూసి సినిమా హిట్‌ కావాలనుకున్నాను. అది కాకుండా దిల్‌రాజు నాకు ఇండస్ట్రీలో మంచి స్నేహితుడు. బన్ని సినిమాతో రాజుకు మరో బ్లాక్ బస్టర్ హిట్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హరీష్‌ కి ఆల్ ది బెస్ట్. దేవి మ్యూజిక్ చాలా బాగుంది. అందరికీ నా శుభాకాంక్షలు” అన్నారు.

ఈ ఈవెంట్ లో అల్లు స్నేహ-అల్లు అయాన్-అల్లు అర్హ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా హీరోయిన్ పూజా హెగ్డే, చిన్నికృష్ణ‌, రావు రమేష్‌, మురళీశర్మ, సుబ్బరాజు, జొన్నవిత్తుల, శ్రీమణి, బాలాజీ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొని సినిమా గ్రాండ్ హిట్ సాధించాలని ఆకాంక్షించారు.