మరో సాంగ్ తో 'డీజే' రెడీ

Monday,May 29,2017 - 01:05 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘దువ్వాడ జగన్నాథమ్’ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఓవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తోంది. ఈ సినిమా జూన్ 23 నుంచి వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయబోతుంది. కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండో సాంగ్ ను మరికొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు.

ఇటీవలే ఈ సినిమా టీజర్ 15 మిలియన్ వ్యూస్ సాధించి భారీ రికార్డుతో హంగామా చేయగా లేటెస్ట్ గా ‘శరణం భజే భజే’ అనే మొదటి సాంగ్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది.. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మరో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ‘గుడిలో బడిలో మడిలో’ అంటూ సాగే ఈ డ్యూయెట్ కచ్చితంగా అందరినీ మెస్మరైజ్ చేసి మోస్ట్ ఫెవరెట్ లిస్ట్ లో మంచి ప్లేస్ సాధిస్తుందంటున్నారు మేకర్స్.