రోజురోజుకు పెరుగుతున్న 'డీజే' క్రేజ్

Wednesday,June 14,2017 - 11:30 by Z_CLU

సూపర్ హిట్ కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే ఆ సినిమా కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా వెయిట్ చేయడం కామన్. అలాంటిది ఓ మూడు సూపర్ హిట్ కాంబినేషన్స్ లో ఓ సినిమా వస్తుందంటే ఇక ఆ సినిమా కి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటి మోస్ట్ ఏవైటింగ్ మూవీగా క్రేజ్ సంపాదించుకుంది ‘డీజే’.

పదేళ్ల క్రితం అల్లు అర్జున్-దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్య’ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన పరుగు కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్-దిల్ రాజు కాంబోలో వస్తోంది ‘డీజే’.

ఇక హరీష్ శంకర్- దిల్ రాజు కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తుంది ‘డీజే’. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన ఈ కాంబో ఈసారి ‘డీజే’ తో గట్టిగానే కొట్టబోతున్నారు.

అల్లు అర్జున్-దేవి ల కాంబినేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్లిద్దరూ కలిస్తే పాటలు హిట్టే. అలా ‘డీజే’ ఆల్బమ్ కూడా ఇప్పటికే అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చేసింది. పాటలతో పాటు దేవి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలైట్ అని దర్శకుడు హరీష్ అంటున్నాడు.

పూజా హెగ్డే  ఈ సినిమాకు ప్లస్ అవుతుందని బన్నీ సరసన రొమాంటిక్ సీన్స్ లో ఈ భామ అదరగొట్టేసిందంటూ యూనిట్ చెప్తుండడంతో పూజా కూడా ఈ సినిమా క్రేజ్ లో భాగం అయి ఎట్రాక్ట్ చేస్తుంది..

ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ వరకూ ఒక్కో ఎలిమెంట్ తో ఒక్కో రికార్డు నెలకొల్పుతూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ.. జూన్ 23న థియేటర్లలోకి వస్తున్నాడు దువ్వాడ జగన్నాథమ్.