షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసిన DJ టీమ్

Tuesday,June 13,2017 - 03:16 by Z_CLU

DJ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసింది సినిమా యూనిట్. ఇంకో 10 రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న DJ, పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఆడియోకు ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో డీజేపై అంచనాలు డబుల్ అయ్యాయి.

హరీష్ శంకర్  డైరెక్షన్ లో అల్టిమేట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన DJ, ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసుకుంది. బన్నీ కెరీర్ లోనే భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా డీజే రికార్డు సృష్టించింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతో ఫస్ట్ టైం బ్రాహ్మణ గెటప్ లో కనిపించబోతున్నాడు బన్నీ. ఓవైపు కామెడీ పంచ్ లు వేస్తూనే, మరోవైపు తన మాస్ పంచ్ లతో యాక్షన్ కూడా అదరగొట్టేశాడు. సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.