మహాశివరాత్రికి DJ టీజర్

Tuesday,February 07,2017 - 02:16 by Z_CLU

స్టైలిష్ స్టార్ ఎంత స్టైల్ గా ఉంటాడో సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు అంతే సైలెంట్ గా ఉంటాడు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో దువ్వాడ జగన్నాథం సెట్స్ పైకి వచ్చింది మొదలు హడావిడిని లాకర్ లో పెట్టి మరీ ఫుల్లీ ఫోకస్డ్ గా సినిమా పై కాన్సంట్రేషన్ పెట్టాడు.

సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ తరవాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ లో బన్ని మరీ అంత టైం తీసుకోడులే అన్న కాన్ఫిడెన్స్ ఉన్నా, ఫస్ట్ లుక్ ఎప్పుడా..? టీజర్ ఎప్పుడా అనే క్యూరాసిటీ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దానికి తోడు నిన్న హరీష్ శంకర్ DJ ఫస్ట్ లుక్ రెడీ అని చేసిన ట్వీట్ ఆల్ రెడీ పీక్ స్టేజ్ లో ఉన్న ఉబలాటాన్ని  మరింత ఇంక్రీజ్ చేసేసింది.

సినిమా యూనిట్ అయితే ఇంకా యూనిక్ రిలీజ్ డేట్, టైం అనౌన్స్ చేయలేదు కానీ ఈ DJ ఫస్ట్ లుక్, లేదా టీజర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఈ మహాశివరాత్రి కి రిలీజ్ కావడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి సినిమా యూనిట్ మైండ్ లో ఏం నడుస్తుందో, ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.