బాలీవుడ్ సినిమా చేయబోతున్న హరీష్ శంకర్..?

Friday,September 20,2019 - 12:32 by Z_CLU

టాలీవుడ్ లో మాసివ్ డైరెక్టర్ అనిపించుకుంటున్న హరీష్ శంకర్, తన బాలీవుడ్ కరియర్ పై కూడా అంతే సీరియస్ గా ఉన్నాడు. రీసెంట్ గా ‘గద్దలకొండ గణేష్’ ప్రమోషన్స్ లో షారుక్ ఖాన్ తో సెట్స్ పై ఉన్నట్టు ఇప్పటికీ కల కంటూ ఉంటానని చెప్పుకున్నాడు.

ఇప్పటికే ఒక్కొక్కరుగా టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ బాలీవుడ్ లో ఇప్పటికే తమ సత్తా చూపిస్తున్నారు. హరీష్ శంకర్ కూడా అదే ప్లాన్ లో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పలేదు కానీ, షారుక్ ఖాన్ తో సినిమా చేయాలనే టార్గెట్ నైతే గట్టిగానే ఫిక్స్ చేసుకున్నాడనిపిస్తుంది.

హరీష్ శంకర్ సినిమాలంటే టాలీవుడ్ లో ఓ ప్రత్యేకత ఉంది. స్క్రీన్ పై మాసిజం ఎత పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేస్తాడో.. బాక్సాఫీస్ దగ్గర కూడా అదే స్థాయి కలెక్షన్స్ రికార్డు చేస్తాడు. ఓ సినిమా రిలీజయిందంటే కొన్ని సంవత్సరాల దాకా ఈ దర్శకుడు రాసుకున్న క్యారెక్టర్స్ అలా కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయి.

చూడాలి మరీ.. టాలీవుడ్ లో ఇప్పటికే ఓ రేంజ్ అందుకున్న హరీష్ శంకర్… బాలీవుడ్ పై సీరియస్ గా ఫోకస్ పెడితే అనుమానం లేదు… అక్కడ కూడా అదే స్థాయి సక్సెస్ అందుకోవడానికి పెద్దగా టైమ్ పట్టదు… అది మాత్రం గ్యారంటీ.