అస్మైక సాంగ్ పై బన్నీ కామెంట్స్

Tuesday,June 20,2017 - 04:18 by Z_CLU

DJ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్ ఓ రేంజ్ అయితే, ఈ సినిమాలోని అస్మైక సాంగ్ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ ఇంకో రేంజ్. సంస్కృతాన్ని ఇంత స్టైలిష్ గా కూడా ప్రెజెంట్ చేయొచ్చు అని చూపించిన డైరెక్టర్ హరీష్ శంకర్, ఈ సాంగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. ఇప్పుడా సాంగ్ పై బన్నీ కూడా రియాక్ట్ అయ్యాడు. సాంగ్ ఎలా కంపోజ్ అయింది.. స్టెప్స్ ఎలా కంపోజ్ చేశారు లాంటి  విషయాల్ని బన్నీ స్వయంగా షేర్ చేసుకున్నాడు.

ఈ సాంగ్ ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని బిగినింగ్ లోనే గెస్ చేసిన సినిమా యూనిట్, పాట కోసం బాలీవుడ్ లో ఇప్పటి వరకు 1500 కి పైగా సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసిన మాస్టర్ గణేష్ ఆచార్య ని అప్రోచ్ అయ్యారు. ఆయన ఈ సాంగ్ కి స్టెప్స్ కంపోజ్ చేసినప్పుడు కలిగిన ఎగ్జైట్ మెంట్ కి, పాట కచ్చితంగా కొత్తగా ఉంటుందని ఫిక్సయిందట సినిమా యూనిట్.

బన్నీ సినిమాలో టాప్ లేచిపోయే స్టెప్స్ ఉంటాయి లాంటి ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ,  ఇలాంటి స్టన్నింగ్ అండ్ స్టైలిష్ స్టెప్స్ తో మెస్మరైజింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ‘అస్మైక సాంగ్’ DJ కి డెఫ్ఫినేట్ గా బిగ్గెస్ట్ ఎసెట్ అనే చెప్పాలి. ఈ సాంగ్ కచ్చితంగా కొత్తగా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేశామని, కానీ రిలీజ్ కు ముందే ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అస్సలు ఊహించలేదంటున్నాడు బన్నీ.