యూట్యూబ్ ను దున్నేస్తున్న దువ్వాడ

Tuesday,June 06,2017 - 12:56 by Z_CLU

సోషల్ మీడియాను దున్నేస్తున్నాడు దువ్వాడ జగన్నాథమ్. ఇలా ట్రయిలర్ రిలీజ్ అయిందో లేదో, అప్పుడే వరల్డ్ వైడ్ ట్రెండింగ్ స్టార్ట్ అయింది. గంటకొకటి చొప్పున యూట్యూబ్ రికార్డులు దువ్వాడకు దాసోహం అవుతున్నాయి.

ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది డీజే ట్రయిలర్. విడుదలైన కొద్దిసేపటికే మిలియన్ మార్క్ క్రాస్ చేసిన ఈ ట్రయిలర్.. తర్వాత 4 గంటలకే 2 మిలియన్ మార్క్ అందుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి 3 మిలియన్ మార్క్ అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ట్రయిలర్ కౌంట్ గంటగంటకు పెరుగుతోంది.

డీజే ట్రయిలర్ మొత్త బన్నీ మేజిక్ కనిపించింది. బ్రాహ్మణ గెటప్ లో పంచ్ లు విసిరిన బన్నీ, సేమ్ టైం స్టయిలిష్ గెటప్ లో యాక్షన్ కూడా ఇరగదీశాడు. గెటప్ పై సస్పెన్స్ ను అలానే మెయింటైన్ చేస్తూ, మరిన్ని అంచనాల్ని పెంచేలా ట్రయిలర్ ను నీట్ గా కట్ చేశారు. ఓవరాల్ గా మెగా ఫ్యాన్స్ కు ఓ ట్రీట్ లా డీజే మూవీ ఉండబోతోందనే విషయం ట్రయిలర్ తో క్లియర్ కట్ గా తెలిసిపోయింది.

బన్నీ గెటప్ తో పాటు దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీజేకు అదనపు బలం. బ్రాహ్మణ గెటప్ లో నడుస్తూ వచ్చే షాట్ తో మొదలైన ట్రయిలర్ లో.. బన్నీ విశ్వరూపం కనిపించింది. దీనికి తోడు “మనం చేసే పనిలో మంచి కనబడాలి గాని, మనిషి కనబడనక్కర్లేదు.” , “పబ్బుల్లో వాయించే డీజే కాదు పగిలిపోయేలా వాయించే డీజే”, ” ఈరోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్, యుద్ధం శరణం గచ్చామి” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి.