హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్

Saturday,March 31,2018 - 11:26 by Z_CLU

హీరోలకు మేనరిజమ్స్ సెట్ చేయడంలో దిట్ట. కమర్షియల్ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లిన వ్యక్తి. అతడే దర్శకుడు హరీష్ శంకర్. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఏ రేంజ్ హిట్స్ ఇచ్చామన్నది ఈ దర్శకుడి కాన్సెప్ట్. పవన్ ను గబ్బర్ సింగ్ గా చూపించినా, సాయిధరమ్ తేజ్ ను సబ్రమణ్యంగా రిప్రజెంట్ చేసినా, అల్లు అర్జున్ ను డీజేగా మార్చినా అది హరీష్ శంకర్ కే సాధ్యం.

షాక్ తో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్.. మిరపకాయ్ తో తన తడాఖా చూపించాడు. రవితేజను మోస్ట్ ఎగ్రెసివ్ గా చూపించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా తర్వాతే అసలైన చరిత్ర మొదలైంది. పవన్ ను హీరోగా పెట్టి తీసిన గబ్బర్ సింగ్ సినిమా హరీష్ ను టాప్ డైరక్టర్ గా మార్చేసింది.

ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా, సాయిధరమ్ తేజ్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలు చేసిన హరీష్ శంకర్.. రీసెంట్ గా అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధమ్ సినిమా చేశాడు. ప్రస్తుతం నితిన్, శర్వానంద్ హీరోలుగా దాగుడు మూతలు అనే డిఫరెంట్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు.

తన కెరీర్ లో మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ హరీష్ శంకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు