1 మిలియన్ వ్యూస్ దాటేసిన DJ జ్యూక్ బాక్స్

Monday,June 12,2017 - 07:05 by Z_CLU

పీక్ లో ఉంది అల్లు అర్జున్ DJ సీజన్. జూన్ 23 న రిలీజ్ కానున్న ఈ పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ సోషల్ మీడియాను రూల్ చేసేస్తుంది. నిన్న రిలీజైన DJ ఆడియో 24 గంటలు కూడా దాటక ముందే 1 మిలియన్ వ్యూస్ రికార్డ్ చేసిందంటే, DJ ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.

దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ 5 సాంగ్స్ ఆల్ రెడీ క్రియేట్ అయిన DJ క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాయి. సినిమా ఫస్ట్ లుక్ రిలీజయినప్పుడు క్రియేట్ అయిన క్యూరాసిటీ, ఆ తర్వాత రిలీజయిన సింగిల్స్ తో మొత్తం కాన్సంట్రేషన్ ని తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయితే నిన్న రిలీజైన ఈ ఆడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో DJ రిలీజ్ కి కౌంట్ డౌన్ బిగిన్ చేసేసింది.

దువ్వాడ జగన్నాథం లా వెజ్ క్యాటరర్ గా ఎంట్రీ ఇవ్వనున్న బన్ని, ఏ సిచ్యువేషన్ లో DJ గా ట్రాన్స్ ఫామ్ కానున్నాడోనన్న క్యూరాసిటీ ఒక ఎత్తైతే, మాసివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రెజెంటేషన్, ఇప్పుడే అక్కడక్కడా దర్శనమిస్తున్న పూజా హెగ్డే గ్లామర్, దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏవైతేనేం సినిమా రిలీజ్ కి ముందే రికార్డ్ బ్రేకింగ్ హిట్ గ్యారంటీ అనే ట్యాగ్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది.