డీజే ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,June 07,2017 - 04:02 by Z_CLU

దువ్వాడ జగన్నాథమ్-డీజే పాటలతో ఎట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సినిమాకు సంబంధించి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మిగతా పాటల్ని యూట్యూబ్ లో కాకుండా, ఆడియో ఫంక్షన్ పెట్టి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం దువ్వాడ జగన్నాథమ్ ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు.

డీజే సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. బన్నీ-దేవిశ్రీది సూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పటివరకు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. డీజే పాటలు కూడా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా కంపోజ్ అయ్యాయి. డీజే టైటిల్ సాంగ్ తో పాటు అస్మైకం అనే మరో డ్యూయట్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. మిగతా పాటల్ని 11వ తేదీన జరిగే ఆడియో ఫంక్షన్ లో రిలీజ్ చేయబోతున్నారు.

డీజేలో 2 డిఫరెంట్ షేడ్స్ లో మెస్మరైజ్ చేయబోతున్నాడు బన్నీ. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది డీజే మూవీ. నిర్మాత దిల్ రాజుకు ఇది 25వ సినిమా.