వారం రోజుల్లో వంద కోట్లు.. బాహుబలి-2 తర్వాత ఇదే

Friday,June 30,2017 - 12:58 by Z_CLU

సినీటౌన్ లో DJ మానియా పీక్ స్టేజ్ లో ఉంది. బాహుబలి 2 తరవాత సెకండ్ హైయ్యెస్ట్ ఓపెనర్ ప్లేస్ ని ఆక్యుపై చేసిన DJ సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయింది. వారం కూడా తిరగకముందే 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ కి DJ రీచ్ అవ్వడం, దానికి తగ్గట్టు బన్ని కరియర్ లోనే ఫస్ట్ టైమ్ బ్రాహ్మణ కుర్రాడిగా కొత్తగా కనిపించడం, DSP మ్యూజిక్, ఇలా చెప్పుకుంటూ పోతే DJ బన్ని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

 

 దిల్ రాజు బ్యానర్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన DJ, సెకండ్ వీక్ కూడా అదే క్రేజ్ ని మెయిన్ టైన్ చేస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా  ఒక్క US లోనే $966,418 కలెక్ట్ చేసి వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతుంది.