హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వం లో `సీటీమార్‌`

Thursday,February 22,2018 - 11:16 by Z_CLU

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్‌హిట్ చిత్రం `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. ఈ మూవీలో `సీటీ మార్ సీటీ మార్‌.. ` అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సినిమాలో హిట్ సాంగ్‌లోని `సీటీమార్` అనే టైటిల్‌తో త్వ‌ర‌లోనే ఓ సినిమా రానుంది. దీనికి కూడా హరీష్ శంకర్ డైరక్ట్ చేయబోతున్నాడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు దిల్‌రాజు బ్యాన‌ర్‌లో `దాగుడుమూత‌లు` అనే సినిమాను రూపొందించే ప‌నిలో భాగంగా స్క్రిప్ట్ వ‌ర్క్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే `జ‌వాన్` చిత్రాన్ని నిర్మించిన అరుణాచ‌ల్ క్రియేష‌న్స్ ప‌తాకంపై కొమ్మ‌ల‌పాటి కృష్ణ నిర్మాణంలో `సీటీమార్‌` సినిమా సెట్స్ పైకి వస్తుంది. వ‌రుస హిట్స్ సాధిస్తున్న యువ క‌థానాయ‌కుడు ఈ సినిమాలో హీరోగా న‌టించనున్నారు.త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్ పూర్తి వివ‌రాల‌ను తెలియ‌జేస్తుంది.