దుమ్ము రేపుతున్న DJ

Wednesday,June 07,2017 - 12:07 by Z_CLU

జస్ట్ 24 గంటల్లోనే 7.4 మిలియన్ వ్యూస్ రికార్డు చేసుకుంది అల్లు అర్జున్ DJ. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్. పూజా హెగ్డే హీరోయిన్ గా, అల్లు అర్జున్ రెండు డిఫెరెంట్ లుక్స్ లో ఊరిస్తున్న ‘DJ’ రిలీజ్ కి ముందే కావాల్సినంత క్రేజ్ బ్యాగ్ లో వేసుకుంటుంది.

జూన్ 23 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. అందునా ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న 25 వ సినిమా కావడంతో, స్పెషల్ కేర్ తీసుకుని మరీ ప్రతి ఎలిమెంట్ ని రిచ్ & క్లాస్ గా ప్లాన్ చేసుకుంది సినిమా యూనిట్. దానికి తోడు అల్లు అర్జున్ అటు బ్రాహ్మణ యువకుడిగా, ఇటు క్లాస్ లుక్ లో మెయిన్ టైన్ చేసిన వేరియేషన్స్ సినిమాకి పెద్ద ఎసెట్ లా మారనున్నాయి.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తే, ఇప్పటికీ గంట గంటకి నంబర్స్ పెంచుకుంటున్న ట్రేలర్ ని బట్టి, ఈ సినిమా ఏ రేంజ్ లో క్రేజ్ క్రియేట్ చేసుకుందో తెలుస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.