ఆ సెంటిమెంట్ తో...

Friday,December 16,2016 - 08:00 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కలిసొచ్చిన ఓ నెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బన్నీ నటించిన లేటెస్ట్ హిట్ సినిమాలన్నీ ఆ నెలలో రిలీజ్ అయి గ్రాండ్ హిట్స్ సాధించాయి. సమ్మర్ హాలీడేస్, పైగా సినిమా సీజన్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే నెల కావడంతో మరోసారి ఆ సెంటిమెంట్ తో దూసుకురావాలని చూస్తున్నాడు స్టైలిష్ స్టార్.

   ప్రెజెంట్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను తనకి కలిసొచ్చిన ఏప్రిల్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్. ఇక ఏప్రిల్ లో రిలీజ్ అయిన ‘రేసు గుర్రం’,’సరైనోడు’ సినిమాలు గ్రాండ్ హిట్స్ సాధించడంతో మళ్ళీ అదే నెలలో ‘డి.జె’ సినిమాతో ఓ గ్రాండ్ అందుకోవాలని చూస్తున్నాడట.