డీజే ఆడియో టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్

Tuesday,May 16,2017 - 02:47 by Z_CLU

దువ్వాడ జగన్నాథం ఆడియో రిలీజ్ కి రెడీగా ఉంది. మంచి టైమ్ చూసుకుని రిలీజ్ అవ్వడమొక్కటే బ్యాలెన్స్. అయితే నిన్న రిలీజైన ఈ ఆడియో రిలీజ్ టీజర్ కి కూడా ఫస్ట్ లుక్ టీజర్ లాగే అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ వస్తుంది.

విడుదలై 24 గంటలైనా కాకముందే డీజే ఆడియో రిలీజ్ టీజర్, యూట్యూబ్ లో అదరగొడుతోంది. ఇప్పటికే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వస్తున్నాయి. జస్ట్ టీజర్ కే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటే, ఇక రేపో మాపో రిలీజ్ కానున్న సాంగ్స్ ని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారో అర్థమైపోతుంది.

అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. బ్రాండెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న 25 వ సినిమా కాబట్టి ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించే పనిలో ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.