అదీ హరీష్ శంకర్ కాన్ఫిడెన్స్...

Tuesday,September 10,2019 - 04:29 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ హరీష్ శంకర్ కరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న సినిమా. బాలీవుడ్ ‘దబాంగ్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జస్ట్ నేటివిటీ కోసమే కాకుండా ఎంటర్టైన్ మెంట్ కోసం కూడా చాలా మార్పులు చేసుకున్నాడు. అవి కాస్త బాక్సాఫీస్ దగ్గర హరీష్ శంకర్ ని మాసివ్ ఫిల్మ్ మేకర్ ఎస్టాబ్లిష్ చేశాయి. అయితే ఇప్పుడు ‘వాల్మీకి’ లో అలాంటి చేంజెస్ చేసుకున్నాడా…?

హరీష్ శంకర్ చేస్తున్న సెకండ్ రీమేక్ ఇది. ‘గబ్బర్ సింగ్’ లో చేంజెస్ చేసుకున్నాడు కాబట్టి ‘వాల్మీకి’ కోసం కూడా  స్పెషల్ గా రాసుకునే ఉంటాడని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు హరీష్ శంకర్. ‘గబ్బర్ సింగ్’ లో చేంజెస్ చేసుకున్నాడు కానీ ‘వాల్మీకి’ వరకు వచ్చేసరికి నేటివిటీ విషయంలో తప్ప ఎక్కడా చేంజెస్ చేసుకోలేదు  అని కన్ఫమ్ చేశాడు.

హరీష్ శంకర్ తన కరియర్ లో చేసిన 2 రీమేక్స్ కి కూడా మెగా హీరోలే కావడం విశేషం. అందుకే ‘గబ్బర్ సింగ్’ సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు, వాల్మీకి కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు హరీష్ శంకర్. నిన్న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.