ఇమోషనల్ గా థాంక్స్ చెప్పిన బన్ని

Tuesday,June 27,2017 - 11:11 by Z_CLU

బన్ని DJ రిలీజైన ప్రతి సెంటర్ లో బాక్సాఫీస్ బద్దలు కొడుతుంది. నాలుగు రోజుల్లోనే 75 కోట్లు బ్యాగ్ లో వేసుకున్న DJ 100 కోట్ల వసూళ్ళ వైపు పరుగులు పెడుతుంది. సినిమా సక్సెస్ గ్యారంటీ అని సినిమా యూనిట్ బిగినింగ్ నుండే కాన్ఫిడెంట్ గా ఉన్నా, ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడం DJ టీమ్ ని కూడా సర్ ప్రైజ్ చేసేసింది. అందుకే నిన్న జరిగిన థాంక్స్ మీటింగ్ లో మంచి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు DJ టీమ్ సినిమా ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పుకుంది.

దిల్ రాజు బ్యానర్ లో 25 వ సినిమా కావడం , అందునా బన్ని తో సినిమా అనగానే దాదాపు 22 నెలలు సినిమా ప్రీ ప్రొడక్షన్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ కి థాంక్స్ చెప్పుకున్న బన్ని, బాక్సాఫీస్ బద్దలు కొట్టడం, వంద కోట్లు కలెక్షన్ అనేది ఒక నంబర్ కాదు, కలెక్షన్ అంటే సినిమాని ఎంత మంది చూసారు, సినిమా వందకోట్ల వసూళ్ళ వైపు పరుగులు పెడుతుందంటే అది అంతమంది ప్రేమను సొంతం చేసుకుంటుంది అని అర్థం. అంత ప్రేమ పంచినందుకు థాంక్స్” అంటూ ఫ్యాన్స్ తో ఇమోషనల్ గా చెప్పుకున్నాడు బన్ని.