స్టార్ డైరెక్టర్ తో కళ్యాణ్ దేవ్ రెండో సినిమా

Wednesday,June 27,2018 - 10:03 by Z_CLU

జూలై 12 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది కళ్యాన్ దేవ్ విజేత. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమాపై  మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే కళ్యాణ్ దేవ్ అప్పుడే తన రెండో సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా DJ తో భారీ హిట్ అందుకున్న మాసివ్ డైరక్టర్ హరీష్ శంకర్ డైరెక్టర్ లో నటించనున్నాడు కళ్యాణ్ దేవ్.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో కళ్యాణ్ దేవ్ సినిమాకి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఇన్ సైడ్ సోర్సెస్ ప్రకారం హరీష్ శంకర్ ఆల్రెడీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ బిగిన్ చేశాడనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

‘విజేత’ సినిమాలో ఏ మాత్రం బాధ్యత లేని యూత్ లా కనిపిస్తూనే, సినిమాలోని ఇమోషనల్ సిచ్యువేషన్ లోను మెచ్యూర్డ్  పర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేయనున్న కళ్యాణ్ దేవ్, ‘విజేత’ రిలీజ్ తర్వాత మరిన్ని భారీ అవకాశాలు అందుకోవడం గ్యారంటీ అనే అనిపిస్తుంది.