సెట్స్ పైకి రానున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా

Thursday,January 24,2019 - 01:06 by Z_CLU

రీసెంట్ గా ‘f2’ తో ‘కామెడీ చేయడం కూడా వరుణ్ తేజ్ కి మస్తు తెలుసు’ అని ప్రూఫ్ చేసుకున్నాడు. ఈ సినిమా హవా ఇంకా తగ్గనే లేదు అప్పుడే నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘జిగర్తాండ’ రీమేక్ ఈ నెల 27 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు ఈ మెగా హీరో.

వరుణ్ తేజ్ సినిమా అనగానే ఆ సినిమా కన్నా, వరుణ్ తేజ్ క్యారెక్టర్ పైనే ఎక్కువ ఫోకస్ నిలుస్తుంది. ‘ముకుంద’ నుండి బిగిన్ అయితే రీసెంట్ సినిమా ‘F2’ వరకు వరుణ్ తేజ్ సినిమాలు గమనిస్తే సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకున్నవే. అయితే ఈ ‘జిగర్తాండ’ లోను నెవర్ ఎక్స్ పెక్టెడ్ బిఫోర్ రోల్ లో కనిపించనున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేస్తాడు వరుణ్ తేజ్.

14+ రీల్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూసర్స్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ ని సినిమా లాంచ్ రోజు రివీల్ చేయనున్నారు మేకర్స్.