హరీష్ శంకర్ డైరెక్షన్ లో అఖిల్ సినిమా

Saturday,January 25,2020 - 12:07 by Z_CLU

రీసెంట్ గా ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు హరీష్ శంకర్. ఇక అఖిల్ విషయానికి వస్తే బొమ్మరిల్లు భాస్కర్ తో సెట్స్ పై ఉన్నాడు. అయితే ఈ సినిమా తరవాత అఖిల్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించబోతున్నాడా…? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ జెనెరేట్ చేస్తున్న టాక్.

హరీష్ శంకర్ ఆల్రెడీ తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ బిగిన్ చేసేశాడు అందులో అనుమానం లేదు. అటు అఖిల్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమా తప్ప ఇంకో సినిమా గురించి ఆలోచన కూడా బిగిన్ చేయలేదు. కానీ వీళ్ళిద్దరితో సంబంధం లేకుండానే ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతుంది.

స్టోరీ కంప్లీట్ గా లాక్ అయ్యాక కానీ హరీష్ శంకర్ హీరో విషయంలో డెసిషన్ తీసుకోడు. ఇక అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్టు ఆ కథ అఖిల్ తోనే ఫిక్సవుతుందా… అంటే చెప్పలేం. ఎందుకంటే స్వయంగా హరీష్ శంకర్ కే ఇప్పటికీ ఈ విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కాంబినేషన్ చుట్టూరా వస్తున్న టాక్ జస్ట్ రూమర్ మాత్రమే.