అల్లు అర్జున్ ఇంటర్వ్యూ

Wednesday,June 21,2017 - 02:30 by Z_CLU

DJ కౌంట్ డౌన్ బిగిన్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న అల్లు అర్జున్ జీ సినిమాలుతో ఎక్స్ క్లూజివ్ గా ఈ సినిమా గురించి, ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ గురించి ఎక్స్ క్లూజివ్ గా షేర్ చేసుకున్నాడు.

 

ఫన్ లోడెడ్ అట్మాస్ ఫియర్

సెట్ పై ఉన్నన్ని రోజులు… నిజానికి చెప్పాలంటే రోజుకి 12 గంటలు పని చేస్తే 12 గంటలు నవ్వుతూనే ఉండేవాళ్ళం, ఎక్కడా స్ట్రెస్ లేదు… చాలా కూల్ గా ఉంటుంది హరీష్ శంకర్ గారి సెట్స్ లో…

తెలంగాణ స్లాంగ్ కష్టమా..? బ్రాహ్మణ స్లాంగా..?

డెఫ్ఫినేట్ గా బ్రాహ్మణ స్లాంగే.. తెలంగాణ స్లాంగ్ అంటే ఎప్పుడూ ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం.. వింటూ ఉంటాం.. పెద్దగా కష్టమనిపించదు. కానీ బ్రాహ్మణ స్లాంగ్ అంటే… హోమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. హరీష్ శంకర్ గారు బ్రాహ్మణ్ కాబట్టి, బేసిగ్గా ఆయనకు తెలుసు, ఆ వాచకం కానీ, డిక్షన్ కానీ.. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. దాని వల్ల ఈజీ అయింది.

 

ఇంతకీ బన్ని ఈ సినిమాలో చేసింది డ్యూయల్ రోలా..?

అ విషయం మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇదొకటే కాదు, సినిమా మొత్తంలో ఎక్స్ పెక్ట్ చేయని సర్ ప్రైజెస్ ఉంటాయి. అవన్నీ డిస్కస్ చేయడం కంటే స్క్రీన్ పై చూస్తేనే థ్రిల్ ఉంటుంది.

ఈ సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతుంది…?

ఈ సినిమాలో యాక్షన్ గురించి మాట్లాడాలంటే రామ్  లక్ష్మణ్ గురించి మాట్లాడాలి. ఈ సినిమాలో యాక్షన్ కొత్తగా ఉందని చెప్పడం కంటే.. క్యారెక్ట రైజేషన్ కొత్తది, సిచ్యువేషన్స్ కొత్తవి.. ఆబ్ వియస్ గా యాక్షన్ ఎలిమెంట్స్ దానికి తగ్గట్టు కంపోజ్ చేశారు. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది హైలెట్స్ ఫైట్సే.

పూజా హెగ్డే గురించి…

పూజా గురించి చెప్పాలంటే చాలా కూల్ మైండెడ్. అవతల వాళ్ళు తప్పు చేసినప్పుడు అంతే కూల్ గా ఉంటుంది. తను తప్పు చేసినా అంతే కూల్ గా ఉంటుంది.  చాలా కూల్ గా మెచ్యూర్డ్ గా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తుంది. ఆ అమ్మాయిలో నాకు అది చాలా బాగా నచ్చింది.

 

టాలీవుడ్ లో ఆడవారికి రెస్పెక్ట్ ఎక్కువ…

టాలీవుడ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ ఆక్టర్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ప్రతి టెక్నీషియన్ యాక్టర్ ని స్పెషల్ గా చూస్తారు. అందునా ఆడవారినైతే ఇంకా స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. అంతే ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తారు. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను..

గణేష్ ఆచార్య గురించి చెప్పాల్సి వస్తే…

గణేష్ ఆచార్య గారు తస్మైక సాంగ్ ని కంపోజ్ చేశారు. ఆయనలో నాకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే.. ఆయన పనిని ట్రీట్ చేసిన విధానం, ఆయన దృష్టిలో ఈ పని చిన్నది… ఈ పని పెద్దది లాంటి డిఫెరెన్స్ ఉండదు.

DSP మ్యూజిక్ గురించి…

ఈ సినిమా ఆడియో రిలీజ్ తరవాత చాలా మంది అడిగారు. DSP మీ కోసం స్పెషల్ గా సాంగ్స్ ఏమైనా కంపోజ్ చేసి పెడతాడా…? అని.. నిజానికి అలా జరగదు.. లక్కీగా ఇద్దరి ఎనర్జీ మ్యాచ్ అవుతుంది…. మ్యూజిక్ కూడా సూపర్ హిట్టవుతుంది.

మీ సింగింగ్ డెబ్యూ ఎప్పుడు..?

నెవర్.. అసలా ఆలోచన కూడా లేదు.. నాకు పాడటం చేతకాదు.