హరీష్ శంకర్ ‘దాగుడు మూతలు’ హీరోలు వీళ్ళే

Tuesday,December 19,2017 - 05:09 by Z_CLU

అల్లు అర్జున్ తో ‘DJ’ లాంటి మాసివ్ హిట్ తరవాత దిల్ రాజు బ్యానర్ లో ‘దాగుడు మూతలు’ సినిమాని  అనౌన్స్ చేసిన హరీష్ శంకర్, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఫాస్ట్ పేజ్ లో కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. నలుగురు వ్యక్తుల మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోలను ఫిక్స్ చేసుకున్నాడు హరీష్ శంకర్.

రెగ్యులర్ సినిమాలా కాకుండా డిఫెరెంట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్, శర్వానంద్ హీరోలుగా నటించనున్నారు. రెగ్యులర్ సినిమాలా కాకుండా కంటెంట్ బేస్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోల కాంబో టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

 

ఇక హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసుకునే ప్రాసెస్ లోను స్పీడ్ పెంచిన సినిమా యూనిట్ రకుల్ ప్రీత్ సింగ్ ని ఒక హీరోయిన్ గా కన్ఫం చేసుకున్నట్టు తెలుస్తుంది. 2018 సమ్మర్ రిలీజ్ కి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ టీమ్, వీలైనంత త్వరలో సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రాసెస్ లో ఉంది.