'డి.జె' లో బన్నీ ఇరగదీస్తాడట...

Sunday,April 02,2017 - 12:00 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వం లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’. హరీష్ శంకర్-అల్లు అర్జున్-దిల్ రాజు వంటి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సరికొత్తగా ఎంటర్టైన్ చేస్తాడట బన్నీ.

అనౌన్స్మెంట్ నుంచే ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా లేటెస్ట్ ట్రైలర్ తో భారీ అంచనాలను నెలకొల్పింది…ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ వైపు బ్రాహ్మణ గెటప్ లో కనిపిస్తూనే మరో వైపు మాస్ ను ఎంటర్టైన్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో ఇరగదీస్తాడట బన్నీ..


బన్నీ క్యారెక్టర్ తో పాటు పూజ హెగ్డే గ్లామర్, దేవి శ్రీ పాటలు,బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డాన్సులు, అబుదాబీ లొకేషన్స్, కామెడీ సీన్స్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయంటున్నారు యూనిట్. సమ్మర్ కానుకగా రానున్న ఈ సినిమాతో బన్నీ ఎలాంటి హిట్ సాధిస్తాడో చూడాలి.