టాప్-10 డీజే ఎట్రాక్షన్స్

Wednesday,June 21,2017 - 10:05 by Z_CLU

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘డీజే దువ్వాడ జగన్నాథం’ రిలీజ్ కి రెడీ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం నుండి థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ప్రెజెంట్ ‘డీజే’     స్పెషల్ ఎట్రాక్షన్స్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరి ఆ ఎట్రాక్షన్స్ ఏంటో చూద్దాం..

దువ్వాడ జగన్నాథంలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న మెయిన్ ఎట్రాక్షన్ బన్నీ క్యారెక్టర్. ఇప్పటి వరకూ లవర్ బాయ్ క్యారెక్టర్స్, స్టైలిష్ క్యారెక్టర్స్, మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన బన్నీ.. డీజే లో ఫస్ట్ టైం ఓ బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. మరోవైపు డీజే అంటూ స్టయిలిష్ కూడా కనిపిస్తున్నాడు. సినిమాకు ఈ రెండు షేడ్స్ మెయిన్ ఎట్రాక్షన్స్.

‘డీజే’కు మరో ఎట్రాక్షన్ హీరోయిన్. బన్నీ-పూజా హెగ్డే ఫ్రెష్ కాంబినేషన్, వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. బన్నీ చెప్పినట్టు సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ కానప్పటికీ.. ఓ కమర్షియల్ సినిమాలో లవ్ ట్రాక్ ఎంత ఉండాలో అంత నిడివి రొమాన్స్ ఉందంటున్నాడు. ఆ తక్కువ స్కోప్ లో కూడా తన మార్క్ చూపించిందట పూజా హెగ్డే. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్, సాంగ్ ప్రోమోస్ తో కుర్రాళ్ల గుండెల్లో ఫిక్స్ అయిపోయింది ఈ సౌత్ బ్యూటీ.

దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ దర్శకుడు హరీష్ శంకర్. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తెరకెక్కించడంలో హరీష్ ఎక్స్ పర్ట్. అలా డీజేలో తన టాలెంట్ మొత్తం చూపించాడు ఈ మాస్ డైరక్టర్. క్యారెక్టర్స్ ను డిజైన్ చేసిన తీరు, పాటల్లో సాహిత్యం, సంగీతం.. ఇలా దాదాపు ప్రతి అంశంలో డైరక్టర్ టచ్ కనిపిస్తుంది.

డీజే లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ దేవి శ్రీ మ్యూజిక్.. బన్నీ సినిమా అంటే చాలు.. దేవిశ్రీకి సూపర్ హిట్ ట్యూన్స్ అలా తన్నుకొచ్చేస్తాయి. ఇప్పటివరకు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. డీజేకు కూడా దేవిశ్రీ తన మ్యూజిక్ మేజిక్ జోడించాడు. సినిమా విడుదలకు ముందే సాంగ్స్ అన్నీ హిట్. మరోవైపు మూవీకి డీఎస్పీ అందించిన రీరికార్డింగ్ కూడా అదిరిపోయిందంటున్నాడు హరీష్ శంకర్.

ఏ సినిమాకైనా కథే బలం. కథ బాగుంటే సినిమా విజయం అందుకోవడం ఖాయం. డీజేకి కూడా కథే బలం అంటున్నారు యూనిట్. తాజా సమాచారం ప్రకారం ల్యాండ్ మాఫియా అనే పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో దువ్వాడ జగన్నాథమ్ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. కథ బాగా నచ్చడం వల్లనే బన్నీ ఈ సినిమా సైన్ చేసాడని నిర్మాత దిల్ రాజు చెప్పాడంటో.. డీజే స్టోరీ లైన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

డీజే సినిమాలో మరో ఎట్రాక్షన్ ఫైట్స్. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ అందరినీ ఆకట్టుకుంటాయని, బన్నీ సీరియస్ యాక్షన్ తో సరికొత్త ఫైట్స్ తో విపరీతంగా ఆకర్షిస్తాడని యూనిట్ చెబుతోంది. యాక్షన్ పార్ట్ కు సంబంధించి ట్రయిలర్ లోనే మచ్చుకు కొన్ని సీన్లు చూపించారు. ఇక సినిమాలో ఫైట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయట.


‘డీజే’ లో ఎట్రాక్ట్ చేస్తున్న మరో ఎలిమెంట్ బన్నీ డాన్సులు. బన్నీ సినిమాలంటే స్టెప్పులు కంపల్సరీ. టాలీవుడ్ లో కొత్తకొత్త స్టెప్పులు క్రియేట్ చేయాలంటే అది బన్నీకే సాధ్యం. డీజేలో కూడా స్టెప్పులు చించేశాడు బన్నీ. అస్మైక సాంగ్ లో క్లాస్ గా డాన్స్ చేస్తూనే, సీటీ మార్ పాటలో మాస్ స్టెప్పులతో దుమ్ముదులిపాడట.


బన్నీ ఓ బ్రాహ్మణ కుర్రాడిగా నటిస్తున్నాడంటే ఆ క్యారెక్టర్ తో కూడిన సీన్స్ లో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఊహించిన ఆడియన్స్ కు టీజర్, ట్రైలర్స్ తో ఆన్సర్ ఇచ్చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పటికే ట్రయిలర్ లో లవ్వో, లవ్వస్య, లవ్వో భ్యః అంటూ బన్నీ చెప్పే డైలాగ్స్ సినిమాలో కామెడీ కి ఢోకా లేదనే విషయాన్నీ రుజువు చేస్తున్నాయి.


దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు మరో ఎట్రాక్షన్ హీరోహీరోయిన్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ. ఫస్ టైం కలిసి సినిమా చేస్తున్న బన్నీ-పూజ.. ఆన్ స్క్రీన్ అదరగొట్టేశారు. అల్టిమేట్ కెమిస్ట్రీతో సినిమాకే ఓ లుక్ తీసుకొచ్చారు. ఫొటోస్, ట్రయిలర్స్, సాంగ్ బిట్స్ లో వీళ్లిద్దరి కెమిస్ట్రీకి ఫిదా అయిపోయారు ఆడియన్స్. మూవీలో ఇంకెన్ని మెరుపులుంటాయా అని ఎదురుచూస్తున్నారు.

 

డీజే ఎట్రాక్షన్స్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే అది దిల్ రాజు బ్రాండ్. దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆ సినిమాపై ఆటోమేటిక్ గా ప్రేక్షకుల చూపు పడాల్సిందే. అంతలా తన బ్రాండ్ వాల్యూ పెంచుకున్న దిల్ రాజు తన బ్యానర్ లో 25 వ సినిమాగా డీజే ను నిర్మించారు. దిల్ రాజు బ్రాండ్ తో వస్తున్న దువ్వాడ జగన్నాథమ్ కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తుంది.