దువ్వాడ జగన్నాథమ్.. క్లైమాక్సే ప్రాణం
Wednesday,June 21,2017 - 11:43 by Z_CLU
భారీ అంచనాల మధ్య ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతోంది దువ్వాడ జగన్నాథమ్-డీజే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే క్లైమాక్స్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని అంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.
దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు క్లైమాక్సే ప్రాణం అంటున్నాడు దర్శకుడు. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారని అంటున్నాడు. రెగ్యులర్ తెలుగు సినిమా క్లయిమాక్స్ లకు భిన్నంగా డీజే క్లైమాక్స్ ఉంటుందని ఊరిస్తున్నాడు. హరీష్ స్టేట్ మెంట్ తో ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
బన్నీ-పూజా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే ప్రమోషన్ ను ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. బన్నీ కెరీర్ లోనే భారీ స్థాయిలో విడుదలవుతున్న చిత్రంగా డీజే రికార్డు సృష్టించనుంది. అటు ఓవర్సీస్ లో కూడా అత్యథికంగా 400 ప్రాంతాల్లో డీజే సినిమాను రిలీజ్ చేస్తున్నారు.