‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ ట్రైలర్ టాక్

Friday,December 01,2023 - 08:02 by Z_CLU

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంచనాలు పెంచుకుంటూ వస్తోన్న ఈ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ టీజర్ రిలీజ్ తర్వాత ఆకాశాన్నంటాయి. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకుల్లో ఎగ్జయిట్‌మెంట్ మరింత పెరిగింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలా ఉండబోతుందోనని అందరూ ఆతృతగా ఎదురు చూడసాగారు. ఎట్టకేలకు  ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్‌డ్, థ్రిల్లింగ్, మాస్ అంశాల కలయికగా ఉన్న ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

ప్రభాస్‌ను  అభిమానులు, సినీ లవర్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి థ్రిల్లింగ్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ లో ఉన్నాయి. యాక్షన్ ప్యాక్డ్‌గా మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్‌లో చెప్పారు. ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది మాస్ మూవీగా ఇది ప్రేక్షకులను మెప్పించనుంది.

పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్, బిగ్గెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిస్తే సినిమా ఎలా ఉంటుందో అనే దానికి ట్రైలర్ ఓ ఉదాహరణగా కనిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌తో రూపొందుతోన్న తొలి సినిమా ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’.

ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీ హాసన్, జగపతి బాబు, బాబీ సింహ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హై బడ్జెట్, టెక్నికల్ వేల్యూస్ ఉన్న ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 22న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.