DJ ఫస్ట్ సింగిల్ ఈ రోజే...

Monday,May 22,2017 - 09:11 by Z_CLU

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ బిగిన్ చేసేశారు. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న DJ ఫస్ట్ సింగిల్ ‘శరణం భజే భజే’ సీజన్ అప్పుడే మొదలైపోయింది. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండే హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ‘DJ దువ్వాడ జగన్నాథం’ ఒక్కో సింగిల్ తో సందడి చేస్తూ సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతుంది.

దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘శరణం భజే భజే’ పై ఆల్ రెడీ ఫిలిం నగర్ లో డిస్కషన్స్ బిగిన్ అయిపోయాయి. ఈ రోజు సాయంతం 6 గంటలకు రిలీజ్ కానున్న ఈ సాంగ్ టైటిల్ ని గమనిస్తే ఇది కంపల్సరీగా డివోషనల్ టచ్ తో, క్లాసిక్ మెలోడీ అయి ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

BUNNY’s DJ MOVIE STILLS