మరికొన్ని గంటల్లో డీజే ట్రయిలర్

Monday,June 05,2017 - 11:28 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ దువ్వాడ జగన్నాథమ్-డీజే ట్రయిలర్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈరోజు సాయంత్రం సరిగ్గా 7 గంటల 30 నిమిషాలకు డీజే ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు 2 సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ అయితే యూట్యూబ్ లో ఏకంగా ఓ సంచలనంగా మారింది. ఇలాంటి టైమ్ లో వస్తున్న ట్రయిలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా ట్రయిలర్ కూడా బాగుంటుందనే బజ్ నడుస్తోంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది డీజే మూవీ. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. నిర్మాతగా దిల్ రాజుకు ఇది 25వ సినిమా కావడం విశేషం.