అల్లు అర్జున్ డీజే ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌డేట్ ఫిక్స్

Monday,February 13,2017 - 10:25 by Z_CLU

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా విశేషాల‌ను నిర్మాత దిల్‌రాజు తెలియ‌జేశారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “`ఆర్య‌`, `బ‌న్ని`, `ఆర్య‌2`, `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రాలు కమ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్‌హిట్ కావ‌డ‌మే కాదు, మ్యూజికల్‌గా కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి అలాంటి హిట్ కాంబో బ‌న్ని, దేవి శ్రీప్రసాద్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మేం కూడా చాలా ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. ఇటు ప్రేక్ష‌కులు, అభిమానులే కాదు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు అతృత‌గా ఎదురుచూస్తున్న డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఫ‌స్ట్‌లుక్‌ను ఈ ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నాం. అలాగే మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌స్తుతం సినిమా క‌ర్ణాట‌క‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఈ ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున అబుదాబిలో షూట్ చేస్తున్నాం. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ఈ చిత్రాన్ని అన్ కాంప్ర‌మైజ్డ్‌గా తెర‌కెక్కిస్తున్నాం“ అన్నారు.

dj