కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ)

Tuesday,November 29,2016 - 02:25 by Z_CLU

కిషోర్ కుమార్ పార్ధసాని ప్రముఖ దర్శకుడు. 2009 లో సిద్దార్థ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు.మొదటి చిత్రం తో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న డాలీ ఆ తరువాత నాగ చైతన్య, సునీల్ కథానాయకులుగా ‘తడాఖా’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం తమిళ్ చిత్రం ‘వెట్టై’ సినిమాకు రీమేక్. ఈ సినిమా తెలుగు లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత వెంకటేష్, పవన్ కళ్యాణ్ కథానాయకులుగా తెరకెక్కిన ‘గోపాల గోపాల’ చిత్రం తో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్నారు. ఈ చిత్రం హిందీ ‘ఓ మై గాడ్’ కు రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధించిన చిత్రం