డీజే టీం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Thursday,June 22,2017 - 02:00 by Z_CLU

 ఓ సూపర్ హిట్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఆటోమేటిక్ గా ఆడియన్స్ ఫోకస్ పెరుగుతుంది. అలాంటిది ఓ మూడు సూపర్ హిట్ కాంబినేషన్ ల కలయికలో సినిమా వస్తుందంటే ఇక ఆ సినిమా పై ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి మోస్ట్ ఎవెయిటింగ్ కాంబోలో తెరకెక్కిన సినిమానే ‘డీజే-దువ్వాడ జగన్నాథం’. డీజే టీం జీ సినిమాలుతో ప్రత్యేకంగా మాట్లాడారు.. ఆ విశేషాలు మీ కోసం..

అల్లు అర్జున్ మాట్లాడుతూ …

 

జస్ట్ వెయిటింగ్…

డీజే రిలీజ్ కి రెడీ అయింది. రిలాక్స్ అవ్వకుండా ప్రమోషన్ లో బిజీ అయ్యాం.. రిలీజ్ రోజు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా.. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారా.. అని వెయిట్ చేస్తున్నాం.

 

చేయగలనా అని అడిగాను

హరీష్ గారు ఈ క్యారెక్టర్ గురించి చెప్పగానే నేను చేయగలనా.. అని అడిగా. భలే వారే చేయగలరు అన్నారు. నాకు మాత్రం భయం ఉంది ఎందుకంటే ఒక బ్రాహ్మిన్ క్యారెక్టర్ వేయడం అంటే అది మామూలు విషయం కాదు.. గెటప్ వేసుకోవచ్చు కానీ డిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్.. అందుకే ఆ విషయంలో భయం వేసింది. కానీ డైరెక్టర్ కాన్ఫిడెంట్ మీదే కొంచెం ఆ డిక్షన్ నేర్చుకొని సినిమా చేశాను.

 

ఆ క్రెడిట్ డైరెక్టర్ కే ఇస్తా

ఈ సినిమాలో నేను చేసిన డాన్సులకి మంచి రెస్పాన్స్ వస్తే కచ్చితంగా ఆ క్రెడిట్ కొరియోగ్రాఫర్స్ కంటే ముందు డైరెక్టర్ కే ఇస్తాను. డాన్స్ చేసేది నేను, చేయించేది కొరియోగ్రాఫర్స్ అయినా అల్టిమేట్ గా ఒక ఐడియా ఒక విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విజన్ తో స్పెషల్ కేర్ తీసుకొని కొత్త స్టెప్స్ వేయించాలని ఒక ఐడియా అందిస్తూ కొరియోగ్రాఫర్ తో చేయించుకున్నారు హరీష్.

 

దేవిశ్రీకి మా ముగ్గురితో యూనిక్ పాయింట్

దేవిశ్రీ కి నాకు, దేవికి దిల్ రాజు గారికి, దేవికి హరీష్ గారికి ఇలా మా ముగ్గురికి దేవి కామన్ పాయింట్ అన్నమాట. మా ముగ్గురికి కంబైన్ గా మంచి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. నాకు ప్రత్యేకంగా అస్మైక పాట బాగా నచ్చింది. చిత్రగారు పాడాక మతిపోయింది. బేసిక్ గా సినిమా అయిపోయాక నా సాంగ్ వినడం అనేది చాల రేర్ కానీ ఈ పాట రిపీట్ గా వింటున్నా.

 

అయాన్ వొద్దులే  అన్నాను

ఆడియో రిలీజ్ కి అయాన్ ని తీసుకొస్తే బాగుంటుంది. నేను కూడా మా మనవడిని తీసుకొస్తా.. ఇద్దరితో ఆడియో రిలీజ్ చేయిస్తే బాగుంటుందని దిల్ రాజు అన్నారు. కానీ నాకు కొంచెం భయం వేసి అయాన్ వొద్దులే సార్ వాడు ఎలా బిహేవ్ చేస్తాడో కావాలాంటే అర్హ ని తీసుకొస్తా అన్నాను. బట్  తీసుకురా మనం చూసుకుందాంలే అన్నారు. వచ్చిన తర్వాత చూస్తే అలా వాడిని చూసి షాక్ అయ్యాను.

 

పూజా హెగ్డే మాట్లాడుతూ …

అలా ఫీలయ్యాను

ఈ సినిమా అఫర్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ హీరో అనగానే వావ్ అనుకున్నా. ఆయన చాలా బిగ్ పర్సనాలిటీ. ఏదో ఆశీర్వాదం వల్ల ఈ అవకాశం వచ్చిందని ఫీలయ్యాను. హరీష్ గారు ముంబయి వచ్చి కథ వినిపించారు. నా రోల్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇప్పటివరకూ నేను చేయని క్యారెక్టర్ ఇది. కొత్తగా అనిపించి ఎగ్జైట్ అయ్యాను.

 

ప్రాక్టీస్ కావాలని చెప్పాను

అల్లు అర్జున్ తో డాన్స్ అనగానే ఆయనతో మ్యాచ్ అవ్వడానికి కొంచెం ప్రాక్టీస్ కావాలని కోరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్ కి ముందే చెప్పాను. చాలా రోజులు డాన్స్ ప్రాక్టీస్ చేశాను. మ్యాచ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేశాను..

హరీష్ శంకర్ మాట్లాడుతూ “

 

‘దువ్వాడ జగన్నాథం’ టైటిల్ ఎప్పటి నుంచో ఉంది

కథ రాసుకున్నప్పుడే దువ్వాడ జగన్నాథం టైటిల్ మనసులో ఉంది. అల్లు అర్జున్ గారు హీరో అనుకున్న తర్వాత డీజే వచ్చింది. మోస్ట్ కాంటెంపరరీ హీరో, బన్నీ స్టైల్ గాని మిగతా విషయాలు గాని చూస్తే లైక్ అర్బన్ హీరో అని బేసిక్ గా తెలిసిపోతుంది. డీజే అనే టైటిల్ ఆప్ట్ టేలర్ మేడ్.. బన్నీ డీజే అంటే ఈజీ గా కనెక్ట్ అవుతారని ఫీలయ్యాం, సేమ్ టైం ఒక డౌట్ కూడా ఉంది. క్యారెక్టర్ లో ఎంటర్టైన్ మెంట్ తో పాటు ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో దువ్వాడ జగన్నాథం అంటే తెలియకుండానే ఎక్కడో తెలియకుండానే ఓ ఫన్ క్యారెక్టర్ లా ఫీలవుతారేమో అనుకున్నాం. బేసిక్ గా జగన్నాథం అనే టైటిల్ ఎందుకొచ్చిదంటే పెద్ద వంశీ గారి సినిమాలో క్యారెక్టర్ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. లైక్ దివాకరం అలా.. ఆయన సినిమాల్లో చాల నార్మల్ నేమ్స్ ఉంటాయి. సో అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేసుకున్న..

 

 రోజుకో సప్రయిజ్ ఇచ్చేవాడు..

ఈ సినిమాలో క్యారెక్టర్ ఇలా ఉంటుందని అనుకున్నప్పుడే కొంచెం ట్రైన్ అవ్వాలని నేను బన్నీ ఇద్దరం అనుకున్నాం. సెకండ్ మీటింగ్ లోనే బన్నీ బ్రాహ్మిన్స్ లో ఎన్ని రకాలుగా ఉంటారు. వారిలో ఒక్కో ప్రాంతం వారు ఎలా మాట్లాడతారనేది బాగా స్టడీ చేశాం. చివరికి విజయవాడ అగ్రహారంలో ఉండే బ్రాహ్మిన్ అంటూ కథను మొదలు పెట్టి అలా స్టార్ట్ చేశాం. నిజానికి ఇలాంటి క్యారెక్టర్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి. కానీ తన డెడికేషన్ తో నాకు రోజుకో సప్రయిజ్ ఇచ్చాడు బన్నీ..

 

బన్నీ కి ఆ అర్హత ఉంది

నిజంగా బన్నీ గారి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ బాగుంటుంది. కాస్ట్యూమ్స్ గాని విజవల్ గాని ఎలా ఉండాలో అన్ని తెలుసు. ఇప్పటికే 17 సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేశారు. బేసిక్ గా నాది ఇది ఆరో సినిమా మాత్రమే.. సో తను ఏదైనా చెప్పడానికి సజిషన్ ఇవ్వడానికి అన్నీ అర్హతలు వున్నాయి. అయినా ఇద్దరికీ ఆల్మోస్ట్ ఒకటే నచ్చేవి.. ముఖ్యంగా సాంగ్స్ షూట్ అప్పుడు ఆయన తీసుకునే కేర్ చాలా బాగుంటుంది. కాస్ట్యూమ్స్ నుంచి అన్నీ దగ్గరుండి తనే చూసుకుంటారు. కానీ డాన్స్ దగ్గర మాత్రం కొంచెం నేను ఇన్వాల్వ్ అయ్యి నాకు కొత్తగా అనిపించేలా ఆయనతో చేయించుకున్నాను. బేసిక్ గా నాకు డాన్స్ అంటే కొంచెం పిచ్చి.

 

దిల్ రాజు మాట్లాడుతూ “

 

పాజిటీవ్ గా ఉన్నాం

చాలా సంతోషంగా అంది. హరీష్ శంకర్ అనుకున్న కథకి మా స్టార్ హీరో బన్నీ, గ్లామర్ క్వీన్ పూజ.. సో అందరూ కలిపి మంచి ప్రోడక్ట్ ఇచ్చారు.. డెఫినెట్లీ పాజిటీవ్ ఆన్ 23rd…

 

వినగానే ఎగ్జైట్ అయ్యాను

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ షూటింగ్ టైం లోనే హరీష్ నాకు ఈ స్టోరీ చెప్పాడు. వినగానే ఎగ్జైట్ అయ్యాను. వెంటనే బన్నీకి చెప్పాను. బన్నీకి కూడా నచ్చడంతో వెంటనే స్టార్ట్ చేశాం.