DJ టీజర్ రివ్యూ

Friday,February 24,2017 - 10:08 by Z_CLU

మహా శివరాత్రికి బ్రాహ్మణ కుర్రాడు భలే ట్రీట్ ఇచ్చాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న 25 వ సినిమా కావడం, అందునా రీసెంట్ గా రిలీజ్ అయిన బన్ని ఫస్ట్ లుక్, సినిమా డెఫ్ఫినేట్ గా డిఫెరెంట్ గా అంటుందని గెస్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ట్రీట్ ఇచ్చాడు అల్లు అర్జున్ .

అల్టిమేట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రాహ్మణ కుర్రాడిగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. దానికి తోడు పూజా హెగ్డే గ్లామర్, సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాయి. దానికి తోడు DSP మ్యూజిక్ ఏముంది ఫ్యాన్స్ DJ టీజర్ రిలీజైన కాసేపట్లోనే సోషల్ మీడియాలో స్పేస్ ని ఆక్యుపై చేయడం అప్పుడే బిగిన్ చేసేసింది.

 

హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటో ఇప్పటికైతే రివీల్  కాలేదు కానీ, బన్నిని సాంప్రదాయంగా చూపిస్తూనే, అల్టిమేట్ యాక్షన్ సీక్వెన్సెస్ కి బోలెడంత స్కోప్ ఉన్న స్క్రిప్ట్ నే ప్లాన్ చేసుకున్నాడు అని సమాచారం.