నైజాంలో రికార్డు సృష్టించిన బన్నీ

Thursday,July 06,2017 - 01:53 by Z_CLU

దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో నైజాంలో సరికొత్త రికార్డు సృష్టించాడు అల్లు అర్జున్. ఈ ఏరియాలో 20 కోట్లు షేర్ సాధించిన హీరోగా నిలిచాడు. నైజాం ఏరియాలో 20కోట్ల కంటే ఎక్కువ మొత్తం ఆర్జించిన హీరోలు చాలా తక్కువ మంది. అందులో బన్నీ కూడా ఒకడిగా నిలిచి, తన మార్కెట్ వాల్యూ ఏంటో చూపించాడు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ విషయానికొస్తే.. నైజాంలో హరీష్ కు 20కోట్లు ఆర్జించి పెట్టిన రెండో సినిమాగా డీజే నిలిచింది. ఇంతకుముందు గబ్బర్ సింగ్ సినిమాతో ఈ ఘనత అందుకున్నాడు హరీశ్.

నైజాంలో డీజే వసూళ్లను తెలుపుతూ మేకర్స్ అఫీషియల్ గా కలెక్షన్ లిస్ట్ విడుదల చేశారు. హైదరాబాద్ లో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ వసూళ్లతో పాటు.. జిల్లాల వారీగా వసూళ్ల వివరాలు వెల్లడించారు. మొత్తం 13 రోజుల్లో డీజే సినిమా 20కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని ప్రకటించారు.

బన్నీ-హరీష్ కాంబోలో మొట్టమొదటి సినిమాగా తెరకెక్కిన డీజే ప్రస్తుతం అన్ని ఏరియాస్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ మూవీకి మరింత ప్రచారం కల్పించేందుకు బన్నీతో పాటు డీజే యూనిట్ అమెరికాలో కూడా పర్యటిస్తోంది. నిర్మాత దిల్ రాజుకు ఇది 25వ సినిమా.