మిలియన్ మార్క్ దాటేసిన డీజే సాంగ్

Wednesday,May 24,2017 - 12:05 by Z_CLU

సోషల్ మీడియాలో బన్నీ క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు సంబంధించి ఏ చిన్న ఎలిమెంట్ రిలీజ్ అయినా అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన ఓ సింగిల్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. విడుదలై పట్టుమరి 2 రోజులైనా కాకుండానే డీజే  సింగిల్ మిలియన్ మార్క్ టచ్ చేసింది.

ఇప్పటి వరకు ఈ పాటకు 11 లక్షల 50వేలకు పైగానే వ్యూస్ వచ్చాయి. వీటిలో 37 వేల 500 లైక్స్ కూడా ఉన్నాయి. జొన్నవిత్తుల రాసిన అద్భుతమైన లిరిక్స్ కు దేవిశ్రీప్రసాద్ ట్యూన్ పర్ ఫెక్ట్ గా సింక్ అవ్వడంతో పాట సూపర్ డూపర్ హిట్ అయింది.

బన్నీ-దేవిశ్రీ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. వీళ్లిద్దరూ కలిసి ఏ సినిమా చేసినా అందులో పాటలు ఫెయిల్ అవ్వలేదు. డీజే సాంగ్స్ కూడా సూపర్ హిట్ అనే విషయాన్ని ఫస్ట్ సింగిల్ ప్రూవ్ చేసింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న  ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. జూన్ 23న విడుదల కానున్న దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు సంబంధించి త్వరలోనే సెకెండ్ సింగిల్ విడుదలకానుంది.